పెప్సీకి ఆ విధంగా షాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

కెరీర్ ఆరంభం నుంచి పెప్సీ కోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇకపై ఆ సంస్థకు ప్రచారం చేయనని స్పష్టంచేశాడు. ఇక నుంచి తాను వాడే ఉత్పత్తులకు లేదా వాటికి అనుబంధంగా ఉన్న ఉత్పత్తులకు మాత్రమే ప్రచారం చేస్తానని.. ఇది తాను తాజాగా తీసుకున్న నిర్ణయమని కోహ్లీ తెలిపాడు. తాను పెప్సీ త్రాగనని.. తాను తాగని పెప్పీ డ్రింక్ ను తాగమని ఇతరులకు చెప్పడం కరెక్ట్ కాదనే ఆలోచనతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అతడు తెలిపాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ విధంగా అన్నాడు..  ”పెప్పీ లాంటి శీతల పానీయాలు త్రాగను.. కేవలం డబ్బు కోసం వాటిని తాగాలని ఇతరుకు చెప్పడం కరెక్ట్ కాదని నా కనిపించింది. అందుకే, వాటిని ఇతరులకు రికమెంట్ చేయలేను” అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. గత ఆరేళ్ల నుంచి పెప్పీ నుంచి కోట్లాది రూపాయల తీసుకుని ఆ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన కోహ్లీ నిర్ణయం పట్ల ఆ  సంస్థ విస్మయం వ్యక్తం చేసింది. ఇంత హఠాత్తుగా కోహ్లీ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో అతడితో సమానమైన క్రేజ్ గల సెలబ్రిటీ కోసం ఆ సంస్థ అన్వేషణలో పడింది.