సెహ్వాగ్ పంపిన రెజ్యూమ్ చూసి బీసీసీఐ అధికారులు షాక్ తిన్నారు!

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సెహ్వాగ్ పంపిన రెజ్యూమ్ చూసి, బీసీసీఐ అధికారులు షాక్ తిన్నారు. బీసీసీఐకి వీరూ పంపిన రెజ్యూమ్‌లో రెండే రెండు ముక్కలు తప్ప మరేమీ లేవు. “ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ జట్టుకు కోచ్ గా, మెంటార్ గా ఉన్నా. అంతకు ముందు ఈ కుర్రాళ్లందరితో కలసి టీం ఇండియాకు ఆడా”… ఈ రెండు ముక్కలే అతడి రెజ్యూమ్‌లో ఉన్నాయి.

ఈ దరఖాస్తును చూసిన బీసీసీఐ అధికారులు బిత్తరపోయారు. వెంటనే సెహ్వాగ్ ను సంప్రదించి, పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్ ను పంపించాలంటూ బతిమాలుకున్నారు.  దరఖాస్తుతో పాటు, పూర్తిస్థాయి రెజ్యూమ్ ను కూడా పంపాలని సెహ్వాగ్ ను రిక్వెస్ట్ చేశామని… ఈ పదవి కోసం ఆయన త్వరలో ఇంటర్వ్యూకు హాజరు కానున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.