అల్లు అరవింద్ ఆ విధంగా అభాసుపాలయ్యాడు!

హిందీ సినిమా రాబ్తా ట్రైలర్ చూసి.. అది తన సినిమా ‘మగధీర’ కథను కాపీ కొట్టి తీశారని అచిత్ర నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ విషయం ఓ సెటిల్‌మెంట్ కు వచ్చిందని తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో  జరిగిన కోర్టు హియరింగ్‌ లో కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్ చూసి రెండున్నల గంటల సినిమా మొత్తం కాపీ అని ఎలా అంటారని రాబ్తా లాయర్లు గట్టిగా అడిగారట. అసలు ‘మగధీర’ సినిమాను తాము కాపీ చేయలేదని రాబ్తా లాయర్లు ఐదు గంటల పాటు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారట. ‘మగధీర’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో హీరోయిన్‌ హీరోనే లవ్ చేస్తుందని, కానీ తమ సినిమా ఫ్లాష్ బ్యాక్‌ లో హీరోది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని,  పైగా సినిమా క్లయ్ మ్యాక్స్ కూడా ‘మగధీర’ తో సంబంధం లేకుండా ఉందని వారు కోర్టుకు తెలిపాట. అలాగే, ‘రాబ్తా’ లోని క్యారక్టర్స్ అన్నీ ‘మగధీర’ పాత్రలతో ఏమాత్రం సంబంధం లేకుండా వేరే గ్రాఫ్ తో ఉంటాయని.. అలాగే ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘100 యోధుల ఫైట్’ ను తాము తీయను కూడా తీయలేదని ‘రాబ్తా’ తరుపు లాయర్లు వాధించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ కూడా వారు కోర్టుకు చూపెట్టినట్లు సమాచారం. మొత్తానికి, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు రాబ్తా నిర్మాతలకు ఫేవర్ గా వచ్చింది. దీంతో రేపు సినిమా యథాతథంగా రిలీజవుతోంది.

 

వాస్తవానికి, కోర్టు తమకు రాబ్తా  దర్శకనిర్మాతలకు  అనుకూలంగా తీర్పు చెప్పినప్పటికీ అల్లు అరవింద్ కన్విన్స్ కాలేదట. దీంతో, ఆయన మళ్లీ పైకోర్టుకు వెళ్లి తమ సినిమాను అడ్డుకోకుండా ఉండేందుకు డైరక్టర్ దినేష్ విజాన్ ఈ సినిమాను ప్రత్యేక ప్రివ్యూ వేసి అల్లు అరవింద్ కు చూపించారని.. ఆ తరువాత అరవింద్ ఈ విషయంలో  కన్విన్స్ అయ్యారని తెలుస్తోంది.