యువరాజ్‌ సింగ్ కు చెమటలు పట్టించిన ఆ బౌలర్ ఎవరో తెలుసా?

లండన్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏర్పాటు చేసిన ఛారిటీ డిన్నర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన బౌలర్‌ షోయబ్ అఖ్తర్‌ అని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే సమావేశంలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మ్యాన్ యువరాజ్ సింగ్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.. దీనికి యువీ.. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన బౌలర్‌ మెక్‌గ్రాత్‌ అని సమాధానమిచ్చారు. కెరీర్ ఆరంభంలో మెక్‌గ్రాత్ బౌలింగ్ తనను భయపెట్టేదని.. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంత గొప్ప బ్యాట్స్‌మ్యాన్ కైనా  సవాలేనని అతడు తెలిపాడు. ఆఫ్ స్టంప్‌పై దూసుకొచ్చే మెక్‌గ్రాత్ బౌలింగ్ ఆడటం మామాలు విషయం కాదని.. బంతిని సరైన లెంగ్త్ అండ్ లెంగ్త్‌తో పాటు అద్భుతంగా మెక్‌గ్రాత్ స్వింగ్‌ చేయగలడని అతడు కితాబిచ్చాడు. అతనికి సాటిరాగల మరో బౌలర్‌ను ఇప్పటిదాకా తాను చూడలేదని యువరాజ్ కొనియాడాడు.