సమంత కాబోయే అత్తగారిని ఆ విధంగా లైన్లో పెట్టుకుంది!

TFC media, tfcmediatelugu, samanthas-relationship-with-naga-chaitanyas-mother/

ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన ప్రేమ, పెళ్లి విషయాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తమకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుండగా.. నాగచైతన్య ఇటీవల ఇస్తోన్న ఇంటర్వ్యూలలో తమ జంటకి సంబంధించిన సరదా సంగతులను చెప్పుకొస్తున్నాడు. తాజాగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ప్రమోషన్స్‌  సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఓ పర్సనల్ విషయాన్ని నాగచైతన్య పంచుకున్నాడు.

 

ప్రస్తుతం తన కన్నా తన తల్లి లక్ష్మితో సమంత ఎక్కువ చనువుగా ఉంటుందని అతడు చెప్పుకొచ్చాడు.  తనతో గొడవ జరిగినప్పుడల్లా, సమంత వెంటనే తన తల్లికి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుందని.. ఆ తర్వాత అమ్మ నుంచి తనకు అక్షింతలు పడుతుంటాయని చైతన్య తెలిపాడు. తమ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా.. తన తల్లి సపోర్ట్  ఎప్పుడూ సమంతకే ఉంటుందని చెప్పాడు. రోజూ ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటారని అతడు తెలిపాడు. తన తల్లికి సమంత అంటే చాలా ఇష్టమనీ..  పెళ్లి కాకముందే తన తల్లిని సమంత పూర్తిగా లైన్లో పెట్టేసుకుందని చైతన్య పేర్కొన్నాడు. అలాగే, తన తండ్రి నాగార్జునకు కూడా సమంత అంటే చాలా ఇష్టమని తెలిపాడు.