వారి ప్రేమ కోసం ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతాః రేణూదేశాయ్‌

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఇప్పటికీ తన అనుబంధం కొనసాగుతుందని  ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తామిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకున్నప్పటికీ, తనకు మాత్రం మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక జీవితాంతం ఎప్పటికీ పవన్ భార్యగానే తాను ఉండిపోతానని ఆమె అన్నారు. పవన్ మాజీ భార్యగా తనకు ఎంతో గుర్తింపు ఉందని.. పవన్ ఫ్యాన్స్‌ తనను ప్రేమగా ‘వదిన’ అని ఇప్పటికీ పిలుస్తుంటారని ఆమె చెప్పుకొచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకుని వారి ప్రేమకు దూరమవడం తనకు ఇష్టం లేదని రేణుదేశాయ్ తెలిపింది. తామిద్దరి విడాకులు  ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని.. అది అత్యంత హఠాత్తుగా జరిగిన పరిణామమని ఆమె తెలిపింది. ప్రస్తుతం తన పిల్లలిద్దరి పెంపకంపైనే దృష్టిపెట్టానని.. అలాగే, మరాఠీ సినీ పరిశ్రమలో సొంత గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆమె తెలిపింది.