రాంచరణ్‌ను ‘రంగస్థలం 1985’ లో దించుతున్న సుకుమార్‌!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ తాజా చిత్రానికి ఎట్టకేలకు టైటిల్ ఖరారు చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు ‘రంగస్థలం 1985’అనే పేరును ఫైనల్ చేశారు. కాగా ఈ సినిమాకు టైటిల్‌ కన్ఫర్మ్‌ చేసేందుకు రామ్ చరణ్‌ గతంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులను హెల్ప్‌ కూడా అడిగాడు. త్వరగా టైటిల్‌ కన్ఫర్మ్‌ కావాలంటే ‘ప్లీజ్‌ సార్‌… మాకు తొందరగా ఓ టైటిల్‌ ఇవ్వండి’ అంటూ సుకుమార్‌పై ఏదో రూపంలో ఒత్తిడి పెంచమని మెగా అభిమానులను చరణ్ రిక్వెస్ట్ కూడా చేశాడు. ఆఖరికి, ‘రేపల్లె’, ‘పల్లెటూరి ప్రేమ’ లాంటి అనేక టైటిళ్లను ప్రక్కనపెట్టి ‘రంగస్థలం 1985’ టైటిల్ ను సుకుమార్ ఓకే చేశారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనసూయ, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కోనసీమ..పాపికొండలు.. రాజమండ్రి, కొల్లేరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ను జరిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.