ప్రభాస్ ప్రక్కన మళ్లీ అనుష్కే ఫైనల్ అయ్యింది!

‘బాహుబలి-2’ సినిమా త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ‘సాహో’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్తో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకోవడంతో, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తొలత హీరోయిన్‌గా ఓ బాలీవుడ్‌ భామను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే, శ్రద్ధాకపూర్‌, దిశా పటానీ లాంటి రైజింగ్ బాలీవుడ్ హీరోయిన్లను  చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే, వారంతా దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ చెప్పడంతో, ‘సాహో’ యూనిట్  వారిని రిజెక్ట్ చేసింది.  ఈ నేపథ్యంలోనే, ఆఖరికి అనుష్క.. పూజాహెగ్డేలలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే, వీరిద్దరిలో కూడా చివరికి ప్రభాస్ సరస అనుష్కనే తాజాగా ఓకే చేసినట్లు తెలిసింది. ప్రభాస్‌-అనుష్కలకు హిట్ పెయిర్‌గా మంచి పేరుండటం.. వారి కాంబినేషన్‌లో వచ్చిన  ‘మిర్చి’, ‘బాహుబలి’ బాగా ఆడటం తదితర కారణాల వల్ల  అనుష్కవైపే మొగ్గుచూపారని సమాచారం. మొత్తానికి, మరోసారి ప్రభాస్‌-అనుష్కల జంట  తెరపై ప్రేక్షకులను కనువిందు చేయనుందన్నమాట!