అక్టోబర్ 6న నాగచైతన్య, సమంతల వివాహం

గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న నాగచైతన్య సమంతల వివావా తేదీ ఫిక్స్ అయ్యింది.  వీరిద్దరి పెళ్లి అక్టోబర్ 6 న జరగనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో జరగిన ఫిలింఫేర్ అవార్డ్స్  ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. హిందూ-క్రిస్టియన్ పద్దతుల్లో వీరిద్దరి వివాహం రెండు సార్లు జరగనుంది. గోవాలో అతి కొద్ది మంది అతిరధుల సమక్షంలో వీరి వివాహాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గా జరపనున్నారు. అయితే,  రెసెప్షన్ ను మాత్రం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొదట్లో వీరిరువురి వివాహం నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన తెలిసిందే.