అమ్మాయిలు.. అబ్బాయిలను ఇవి చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు!

 

అమ్మాయిలు.. తమ సరిజోడి విషయంలో ఏయే లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం తెలుసుకోవడానికి ఓ ప్రముఖ మ్యారేజ్ పోర్టల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఏ విధంగా ఊహించుకుంటున్నారో చాలా క్లారిటీగా చెప్పారు. సదరు మ్యారేజ్ బ్యూరో సంస్థ మొత్తం ఏడు వేల మందిని సర్వే చేయగా.. ఇందులో 54 శాతం అమ్మాయిలు తమ మొదటి ప్రాధాన్యత అబ్బాయిల ఫిజికల్‌ ఎపియరెన్స్ కేనని సమాధానమిచ్చారు. మరో 20 శాతం మంది అమ్మాయిలు మాత్రం అబ్బాయి ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాడన్నది తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.  ఇక,ఆరు శాతం అబ్బాయిల సెన్సాఫ్ ఆఫ్ హ్యుమర్ తమకు అత్యంత ముఖ్యమని చెప్పగా.. మిగిలిన 20 శాతం అమ్మాయిలు.. అబ్బాయి ఉద్యోగంతో పాటు కుటుంబం నేపథ్యం, ఆస్తిపాస్తులు, చదువు.. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటామని స్పష్టం చేశారు.