ఇస్రో మరో అద్భుత విజయం!

ఇస్రో మరోసారి అద్భుత విజయం సాధించింది. 640 టన్నుల బరువు గల జీఎస్‌ఎల్సీ మార్క్‌-౩ డీ-1 వాహన నౌక ద్వారా జీశాట్‌-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.  జీ శాట్‌-19 ఉపగ్రహం బరువు మూడు వేల 136 కిలోలు. 16 నిమిషాల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి జీ-శాట్‌ 19 ప్రవేశించింది. జీ-శాట్ పది సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో బరువైన ఉపగ్రహాల ప్రయోగించగల అగ్రదేశాల సరసన భారత్ చేరింది. జీశాట్‌-19 ఉపగ్రహం ద్వారా అధునాతన సమాచార వ్యవస్థ బారత్‌కు అందుబాటులోకి రానుంది. అలాగే, ఇకపై అత్యంత హై స్పీడ్ ఇంటర్నట్ సేవలు భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఇస్రో మరోసారి చిరస్మరణీయ విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిందని ప్రధాన మోదీ కొనియాడారు