అతడి బౌలింగ్ ఆడటం చాలా కష్టం.. అతడే నా దృష్టిలో గొప్ప బౌలర్: ధోనీ

140 కి.మీటర్ల పైగా వేగంతో బంతులు విసిరే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమేనమని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ చెప్పాడు. తనకున్నది పరిమితమైన టెక్నిక్‌ అని, అటువంటి టెక్నిక్‌తో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి అప్పుడప్పుడు కష్టపడుతుంటానని అతడు తెలిపాడు. ప్రపంచ ఫాస్ట్ బౌలర్లలో ఎవరు గొప్ప? అని అడిగితే… తాను రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌  షోయబ్ అఖ్తర్ పేరే చెబుతానని అన్నాడు. షోయబ్ అత్యంత వేగంగా బంతులు వేస్తాడని.. ఒక్కోసారి ఏ బంతిని ఎలా వేస్తాడో కూడా అర్థంకాదని చెప్పాడు.

ఒక బంతిని బౌన్సర్ గా వేస్తే, మరో బంతికి యార్కర్ ను సంధిస్తాడని, మరో బంతిని బీమర్ గా వేస్తాడని.. మరో బంతిని గుడిష్ లెంగ్త్‌లో వేస్తాడని తెలిపాడు.  షోయబ్ బంతులను అంచనా వేయడం చాల కష్టమని చెప్పాడు. షోయబ్ బౌలింగ్ లో ఆడటం.. అతడి బంతిని బౌండరీకి తరలించడం తనకు చాలా ఛాలెంజింగ్‌ ఉండేదని తెలిపాడు. లండన్‌ లో విరాట్ కోహ్లీ ఏర్పాటు చేసిన ఛారిటీ విందుకు హాజరైన సందర్భంగా.. ‘మీరు ఎదుర్కొన్న గొప్ప  ఫాస్ట్ బౌలర్‌ ఎవరు?’ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా ధోనీ పై విధంగా సమాధానమిచ్చాడు.