మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో భారీ అసెంబ్లీ సెట్‌!

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్- కొరటాల కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న  ఈ చిత్రంలో మహేష్ బాబు రాజకీయ నాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో భారీ అసెంబ్లీ సెట్ ను వేస్తున్నారు.  సెకండ్ షెడ్యూల్ మొత్తాన్ని ఈ అసెంబ్లీ సెట్‌లోనే షూట్ చేయనున్నారు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ సెట్ లో మహేష్ బాబుపై దర్శకుడు చిత్రీకరించనున్నారు. ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోను, వినోదంతో పాటు మంచి  సందేశం కూడా ఉంటుందట. ఎం.ఎస్ ధోనీ బయోపిక్ మూవీలో హీరోయిన్‌గా నటించిన కైరా అద్వానీ ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించనుంది.