ఆ ఇద్దరిలో ఒక్కరే ప్రభాస్ హీరోయిన్‌!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించనున్న చిత్రం ‘సాహో’ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినప్పటికీ, హీరోయిన్ మాత్రం ఇప్పటిదాకా ఫైనల్ కాలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకోవడంతో.. తొలత పేరున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకోవాలనుకున్నారు. అయితే, వారు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్లు చెప్పడంతో తాజాగా ఆ ఆలోచనను దర్శకనిర్మాతలు విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం అనుష్క .. పూజా హెగ్డే  పేర్లను మాత్రమే పరిశీలిస్తున్నారట. వీరిద్దరిలో ఎవరో ఒకరిని త్వరలో ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. హిట్ పెయిర్‌గా పేరొందిన ప్రభాస్‌-అనుష్కల కాంబినేషన్‌తో వెళ్లాలా లేక ఫ్రెష్‌ ఫీల్‌ ఉండే ప్రభాస్-పూజా హెగ్డేలతో వెళ్లాలా అనే విషయంలో దర్శక నిర్మాతలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.