యువరాజ్ బ్యాటింగ్‌ చూసి.. నేనొక క్లబ్ ఆటగాడినేమో అనిపించిందిః కోహ్లీ

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే 52 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపుతిప్పన యువీపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. యువరాజ్ చెలరేగి ఆడుతుంటే.. అతని ముందు తానొక చిన్న క్లబ్ బ్యాట్స్‌మ్యాన్‌లా చిన్నబుచ్చుకున్నానని కోహ్లీ తెలిపాడు. వాస్తవానికి, కోహ్లీ ఎటాకింగ్ బ్యాట్స్‌ మ్యాన్‌.. కానీ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. బ్యాటింగ్ దిగిన తర్వాత కోహ్లీకి టైమింగ్ సరిగ్గా కుదరలేదు. దీంతో, క్రీజ్‌లో కుదురుకోవడానికి అతడు సమయం తీసుకున్నాడు.  అయితే, కోహ్లీ తడబడుతున్నప్పటికీ టీం ఇండియా స్కోర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 36 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఉన్న టీమిండియా స్కోర్ యూవీ దూకుడు కారణంగా మరో తొమ్మిద ఓవర్లకి 285కు చేరుకుంది. ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ.. ”పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో యువరాజ్ అద్భుతంగా ఆడాడు.. సరిగ్గా టైమింగ్‌ కుదరక నేను తడబడుతున్న సమయంలో మరో వైపు నుంచి ఫాస్ట్ గా స్కోర్ చేస్తూ నాపై ఉన్న ఒత్తిడినంతా అతడు దూరం చేశాడు.. అతడి ముందు నేనొక క్లబ్ బ్యాట్స్‌మన్నేమో అనిపించింది. యువీ ముమ్మాటికి మ్యాచ్ విన్నర్‌. అందుకే, అతడిని తుది జట్లులోకి తీసుకున్నా” అని కోహ్లీ తెలిపాడు.