ప్రభాస్ తో పెళ్లంటే.. కేసులు పెడతానంటున్న అనుష్క!

‘బాహుబలి’ పెయిర్‌ ప్రభాస్, అనుష్కలకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్ల కాంబినేషన్‌లో ఇప్పటిదాకా ‘బిల్లా’, ‘మిర్చి’.. ‘బాహుబలి’ చిత్రాలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహోలో కూడా అనుష్కనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు.  పైగా బయట కూడా వీరిద్దరూ బాగా సన్నిహితంగా కనిపిస్తారు. ‘బాహుబలి’ ప్రమోషన్స్ సందర్భంగా కూడా వీరిద్దరూ బాగా చనువుగా మెలిగారు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య ప్రేమించుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారడంతో.. అతడు అనుష్కనే వివాహం చేసుకోనున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ రూమర్లను ఇన్నాళ్లు  ఏమాత్రం పట్టించుకోని అనుష్క.. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా రెస్పాండవుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో  ప్రభాస్‌తో తన పెళ్లి జరగనుందన్న ప్రచారంపై మండిపడింది. ఇలాంటి అనవసరపు  ప్రచారాలు పనిగట్టుకుని చేస్తున్నవారిపై  కేసులు పెడతానని ఆమె హెచ్చరించింది. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం గురించి మరీ హద్దులు దాటి మాట్లాడటం సరికాదని.. ఎవరి పని వాళ్లు చూసుకోకుంటే బాగోదని ఆమె హెచ్చరించింది. సాధారణంగా, చాలా సెన్సిటివ్‌గా మాట్లాడే అనుష్క ఓ రూమర్‌పై ఈ  ఫైర్ అయిపోవడం ఫిలింనగర్ వర్గాలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో, అనుష్కకు వేరే హీరోలతో సంబంధాలు అంటగడుతూ ఇంత కన్నా ఎక్కువ ప్రచారాలు జరిగాయి. అయితే, ప్రస్తుతం రియాక్ట్ అయినట్టు గతంలో ఎప్పుడు ఆమె రియాక్ట్ కాలేదు.  తాను కూడా పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని అనుష్క భావిస్తుందని.. అందుకే, ప్రభాస్‌తో పెళ్లి వార్తలపై అనుష్క ఇంత సీరియస్‌గా రియాక్ట్ అయి ఉంటుందని.. ఫిలింనగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.