సాక్షి టీవీకి తమ్ముడు వస్తున్నాడు! త్వరలో ఓ కొత్త ఇంగ్లీష్ ఛానల్ ను ప్రారంభించబోతున్న జగన్‌!

ఇటీవల ‘టైమ్స్ నౌ’ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్‌ అర్ణబ్ గోస్వామి ఆధ్వర్యంలో ‘రిపబ్లిక్’ అనే కొత్త ఇంగ్లీష్ ఛానల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బాటలోనే త్వరలో మరో నేషనల్‌ ఛానల్  రాబోతుందట. అయితే ఈ ఛానల్ ప్రారంభించబోతుంది మరెవరో కాదు.. వైసీపీ అధ్యక్షుడు  జగన్‌మోహన్ రెడ్డేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బర్కాదత్ ఆధ్వర్యంలో ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ను ప్రారంభించేందుకు జగన్ నిశ్చయించుకున్నారని సమాచారం. ఎన్డీటీవీ లో నిర్విరామంగా 21 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించిన బర్ఖాదత్‌ ఐదు నెలల క్రితం ఆ ఛానల్‌కు  రిజైన్ చేశారు.  అప్పటి నుంచి  ఆమె మరో ఛానల్‌ లో చేరలేదు. ఈ నేపథ్యంలోనే, తాజాగా ఆమె జగన్ రెడ్డి పెట్టే కొత్త ఛానల్‌ లో చేరబోతున్నారని ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.  వైఎస్ జగన్‌ ను వైఎస్ భారతి ని బర్ఖాదత్ ఇటీవల హైదరాబాద్ వచ్చి మరీ కలుసుకోవడంతో ఈ రూమర్‌కు మరిన్ని రెక్కలు వచ్చాయి. వాస్తవానికి, ఆ మధ్యన జగన్ కాస్త ప్రాభవం తగ్గిన ఓ ఇంగ్లీష్ పేపర్ ను టేకోవర్ చేసుకోవాలనుకున్నారు. అయితే అది ఫెయిల్ అవడంతో ఓ కొత్త ఇంగ్లీష్ పేపర్ ను స్టార్ట్ చేయాలని ఆయన కొన్నాళ్ల క్రితం నిశ్చయించుకున్నారు. అయితే, ఈడీ.. సీబీఐ కేసులు మళ్లీ పైకి రావడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే, తాజాగా ఈడీ, సీబీఐ ఇబ్బందులు లేకుండా ఓ ప్రత్యామ్నాయ మార్గాన్ని జగన్ కనుగొన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇంగ్లీష్‌ న్యూస్ పేపర్ స్థానంలో ఇంగ్లీష్‌ న్యూస్ ఛానల్‌ ను ఆయన ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.  తన ప్రారంభించే ఛానల్‌ కు  ‘ఫేస్ ఆఫ్ ది ఛానల్‌’ గా  బర్ఖా దత్ ఉంటే బాగుంటుందని జగన్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి బర్కాదత్‌కు జగన్‌ కు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. సాక్షి టీవీ ప్రారంభించిన తొలి రోజుల్లో ఆ ఛానల్ కంటెంట్, లుక్‌ మరియు ఫీల్‌ ఇంప్రూవ్‌మెంట్ కోసం ‘ఎన్డీటీవీ’ సహాయం తీసుకున్నారు.  అప్పటి నుంచే బర్ఖాదత్‌కు జగన్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.