రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న రజినీకాంత్

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆయన పొలిటికల్‌ ప్యూచర్‌పై ఎడతెగని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అభిమానులను ఎన్నడూ నిరాశ పరచనని హామీ ఇచ్చారు.ఆ తరువాత రజిని తాను బాబా సినిమాలో చేతి గుర్తు ని ప్రకటించారు,అయితే దీంతో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ప్రజల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశానికే అభిమానులతో రజనీకాంత్‌ సమావేశాలని నిర్వహించి తాను రాజకీయాల్లో కి వస్తాను అని క్లారిటీ ఇచ్చారు.