రాజకీయాలపై చెప్పాల్సింది చెప్పా.. ఇక నన్ను ఇబ్బందిపెట్టొద్దుః రజనీకాంత్‌

కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో అరంగేట్రం చేయాలనే  కోరిక తనకు లేదని.. నటనే తన వృత్తి అని, దేవుడు తనను కేవలం ఆ పని మాత్రమే చేయమని శాశించాడని, అందుకు తాను అదే పని చేస్తున్నానని,  ఒకవేళ  పైనున్న దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి ఆస్కారం లేని చక్కటి పాలనను అందిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత చెప్పినప్పటికీ అభిమానులు ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రావాలని గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో..  ఈ రోజు చైన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణమండలో అభిమానులతో మూడో రోజు జరిగిన సమావేశంలో రజనీ  మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.. రాజకీయాల విషయమై తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదని.. దయ చేసి ఈ విషయంలో తన పై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆయన అభిమానులను కోరారు.