మహేంద్ర సింగ్ ధోనీ ఎంత గొప్ప మనిషంటే..

తమకు  ఏ మాత్రం అందుబాటులో ఉండటం లేదన్న కారణంతో,  ధోనీ ని పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఆ జట్టు యాజమాన్యం తొలగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకునేడప్పుడు జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఆ విషయాన్ని ధోనీకి చెప్పి అతడి అభిప్రాయం అడిగారు. తాను ఎవరి కెప్టెన్సీలోనైనా ఆడతానని, టీం యజమానిగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను శిరసావహిస్తానని ధోని గోయంకాకు తెలిపాడు. ఇండియన్ కెప్టెన్‌గానే కాకుండా ఐపీఎల్ కెప్టెన్‌గా ఘనమైన రికార్డ్ ను కలిగిన ధోనీని కెప్టెన్సీని తప్పించినందుకు ఫ్రాంచైజీ యాజమాన్యంపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు విరుచుకుపడ్డారు. మైదానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత మనో నిబ్బరం చూపిస్తాడో తనను కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ ఏ మాత్రం చలించకుండా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆటగాడిగా తన బాధ్యతలు ధోనీ చక్కగా నిర్వర్తించాడు. అలాగే, తొలి మ్యాచ్ అయిపోయిన తర్వాత పూణే యజామాని సంజీవ్ గోయంకా సోదరుడైన హర్స్‌ గోయంకా కెప్టెన్‌ స్మిత్ ముందు తనను తక్కువ చేసి మాట్లాడినా ధోనీ ఏ మాత్రం చలించలేదు. పుణే యాజమాన్యాన్ని ఒక్కమాట కూడా అనలేదు. అదే మరో ఆటగాడైతే కచ్చితంగా నోరు జారివారేడు. ఈ సహనానికే.. ఓర్పుకే క్రీడా ప్రపంచం ధోనీని చూసి ముచ్చటపడింది.

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో పుణే ఫైనల్‌ కు చేరిందంటే.. దానికి ధోనీ కూడా ఓ కారణం! సెమీఫైనల్‌లో ధోనీ ఆఖరి  రెండు ఓవర్లో అత్యంత పటిష్టమైన ముంబై బౌలింగ్ ను చితకబాదకుంటే పుణే ఫైనల్‌కు చేరేది కాదు. తాజాగా ధోనీ వ్యక్తిత్వం గురించి ఈ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడైన బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. “ధోని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏ సలహాలైనా తీసుకోవచ్చు. ధోనీ అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఏ సమస్యనైనా అతడు ఓపిగ్గా విని, మంచి సలహాలు ఇస్తాడు.  అతడి క్రికెట్‌ పరిజ్ఞానం అపారం.. ప్రత్యేకం. గ్రౌండ్‌ లో ఫీల్డింగ్‌ కూర్పుపై అతడికి గొప్ప పట్టు ఉంది. స్మిత్‌ మా కెప్టెన్‌ అయినప్పటికీ.. ధోనీనే ఈ విషయంలో అత్యుత్తతమని అతడికి కూడా తెలుసు. అందుకే, ఫీల్డింగ్‌ ఏర్పాట్లపై ధోనీతో మాట్లాడే అతను నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని బెన్‌స్టోక్ చెప్పుకొచ్చాడు.