ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే, శర్వానంద్ చేసుకుంటాడట!

ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాలతో పోటీపడి మరీ ‘శతమానం భవతి’ లాంటి  హిట్ ఇచ్చిన శర్వానంద్ తాజాగా ‘రాధ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కెరీర్ వైస్‌గా ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న శర్వానంద్‌ పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం తల్లిదండ్రులు పెడుతున్న పెళ్లి ఒత్తిడి  కారణంగా బాగా ఇబ్బందిపెడుతున్నారట. శర్వాను పెళ్లి చేసుకోమని అతడి తల్లిదండ్రులు చాలా కాలంగా అతడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. మెగా పవర్ స్టార్‌ రాంచరణ్ శర్వానంద్ కు క్లాస్‌మేట్‌. ఈ నేపథ్యంలో.. ‘నీ క్లాస్‌మేట్ అయిన రాంచరణ్‌ ఉపాసనను పెళ్లి చేసుకుని ఐదేళ్లు దాటింది. కానీ నువ్వు మాత్రం ఇంకా పెళ్లి  చేసుకోలేదు’  అని అతడితో  వాదిస్తున్నారట. దీనికి కౌంటర్‌గా  శర్వానంద్‌ ప్రభాస్ ను అడ్డుపెట్టుకుని పెళ్లిని వాయిదా వేస్తున్నాడట. తన కన్నా పెద్దవాడు, టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ కే పెళ్లి కాలేదని.. అలాంటప్పుడు తన పెళ్లికేం తొందరవచ్చిందని ఆర్గ్యూచేస్తున్నాడట. ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే తాను కూడా చేసుకుంటానని లాజిక్ లేకుండా సమాధానం చెబుతున్నాడట. దీంతో, శర్వానంద్‌ ను పెళ్లికి ఎలా ఒప్పించాలో తెలియక అతడి తల్లిదండ్రులు తలబాదుకుంటున్నారని అతడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శర్వానంద్ బాటలోనే రానా కూడా తన కుటుంబం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, ఇలాగే ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకుంటున్నాడట. మొత్తానికి టాలీవుడ్‌ లో చాలా మంది ‘పెళ్లి కాని ప్రసాద్’ లందరూ ప్రభాస్ ను అడ్డుపెట్టుకుని తమ పెళ్లిళ్లు వాయిదా వేస్తున్నారు.