పిల్లలతో కలిసి తన హాలీవుడ్ సినిమా చూడవద్దంటున్న ప్రియాంక చోప్రా!

హాలీవుడ్‌లో సత్తా చాటుతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన తొలి చిత్రం ‘బేవాచ్‌’. మయామీలో ఆదివారం ఈ సినిమా ప్రీయమియర్ షోకు హాజరైన ప్రియాంక ఈ సందర్భంగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడింది.  తాను ‘బేవాచ్’ షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశానని, సహనటులందరూ తనతో బాగా కలిసిపోయారని ఆమె తెలిపింది. అలాగే ఈ సినిమాలో  ‘విక్టోరియా లీడ్స్’ అనే నెగటివ్ పాత్రను తాను చేశానని, ఆ పాత్ర కోసం తాను బాగా కష్టపడ్డానని ఆమె తెలిపింది. ‘బేవాచ్‌’ ను సమ్మర్ ఫిలిమ్‌ గా ఎంజాయ్ చేయవచ్చని.. అయితే పిల్లల్ని దయచేసి తమ సినిమాకు తీసుకురావద్దని కోరింది.. బేవాచ్ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా కాదని ఆమె అభిప్రాయపడింది.  భారత్‌లో ఈ సినిమా జూన్‌ 2న రిలీజ్ అవుతుంది.