పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పోటీ చేసేది అక్కడి నుంచే! పవన్ ఆ స్థానాన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తాను అనంతపురం నుంచే పోటీ చేస్తారని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. అయితే జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, జనసేన లోని విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కదిరి లేదా గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ రెండింటిలో కూడా కదిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన ఎక్కువ మొగ్గుచూపతున్నట్లు సమాచారం. ఒక వేళ ఎన్నికల సమయానికి అనివార్య కారణాల వల్ల అది కుదరని పక్షంలో ప్రత్యామ్నాయంగా గుంతకల్లు నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.

ఇంతకీ, కదిరిని పవన్ కల్యాణ్ ఎంచుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కరవు జిల్లా అయిన అనంతపురం లో కదిరి నియోజకవర్గానిది మరింత దారుణమైన పరిస్థితి! ఈ ప్రాంతం అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం.  కొన్నేళ్లుగా కదిరిని కరవు కాటేస్తూనే ఉంది.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు.  వేసవి కాలం వచ్చిందంటే చాలు భారీ సంఖ్యలో ప్రజల వలస వెళ్లుంటారు. అలాగే, బత్రకడానికి మరో దారి లేక  మహిళలు ముంబై తదితర ప్రాంతాల్లోని వేశ్యాగృహాలకు తరలిపోతున్నారు. ఇలా దారుణమైన కరవు, వలసలు, మహిళల అక్రమ రవాణా తదితర అంశాలు పవన్ కల్యాణ్ ను బాగా బాధపెట్టాయి.  ఈ నేపథ్యంలోనే, నియోజకవర్గంలోని ప్రజలకు కొండంత అండగా ఉండాలనే ఆలోచనతో.. ఈ ప్రాంతంలోని సమస్యలన్నీ రూపుమాపాలనే సద్దుదేశంతో తన రాజకీయ జీవితాన్ని రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన  కదిరి నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నాడని జనసేన వర్గాలు చెబుతున్నాయి.