ఆ దేశంలో ‘బాహుబలి-2’ ను చిన్న పిల్లలు చూడకూడదట!

ఆసియా.. యూరప్‌ ఖండాలకు చెందిన చాలా దేశాలు ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశాయి.  తాజాగా సింగపూర్‌ సెన్సార్ బోర్డు కూడా ‘బాహుబలి పార్ట్‌-2’ కు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఆ దేశంలో ‘బాహుబలి-2’ ను చూసేందుకు పదహారేళ్ల లోపు పిల్లలను థియేటర్లకు అనుమతించరు. భారత్‌లో ‘బాహుబలి-2’ కు సెన్సార్‌ బోర్డు ‘యు/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సింగపూర్‌తో పాటు మిగతా దేశాలు ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఈ సినిమాలో ఎక్కువుగా హింసాత్మక దృశ్యాలు ఉండటమేనని.. మరీ ముఖ్యంగా తలలు నరికే సన్నివేశాలు ఎక్కువుగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో ఆయే దేశాల్లో బాహుబలి-2 ను ను చూడటానికి  చిన్నారులకు అవకాశం లేకుండా పోయింది.